కరోనాకి థ్యాంక్స్.. కలిపింది ఇద్దరినీ..

కరోనాకి థ్యాంక్స్.. కలిపింది ఇద్దరినీ..

వైరస్ వచ్చి అందరి బంధాలను దూరం చేస్తుంటే 50 ఏళ్ల క్రితం విడిపోయిన ఆ అక్క చెల్లెళ్లను మాత్రం కలిపింది. నెబ్రాస్కాకు చెందిన 73 ఏళ్ల డోరిస్ క్రిప్పెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె కోవిడ్ -19 నుండి కోలుకుంటున్నసమయంలో అనారోగ్య కారణంగా పడిపోయింది. దాంతో చేయి విరిగి ఆస్పత్రి పాలయ్యింది. అందులో పని చెస్తున్న ఓ డాక్టర్ తన చెల్లెలు అని డోరిస్ కి తెలియదు. 53 ఏళ్ల బోరో రోగుల జాబితాలో ఉన్న తన అక్క పేరును గుర్తించింది.

1967లో ఇద్దరు అక్కచెల్లెళ్లు విడిపోయారు. వారి తండ్రి వారిని ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు. బోరోకి అప్పుడు 6 నెలలు. నేను 20 ఏళ్లు పెద్దదాన్ని కాబట్టి నాకు గుర్తుంది. ఆమెను నేను తాకాను. నేను మళ్లీ చెల్లిని కలుసుకుంటానని అనుకోలేదు. కానీ ఎప్పుడూ గుర్తొస్తుండేది. ఇప్పుడు ఈ విధంగా కరోనా వచ్చి నాకు నా చెల్లి వైద్యం చేస్తుందని ఊహించలేదు అని సంతోషంతో చెబుతోంది డోరిస్. బోరో తన అక్కతో కమ్యూనికేట్ చేయడానికి ఆమెకు వినపడదని వైట్ బోర్డ్ ఉపయోగించారు.

బోర్డు మీద మీ తండ్రి పేరు వెండాల్‌ హఫ్‌మ్యాన్‌? అని రాసింది. దానికి డోరిస్‌ అవునని తలూపడంతో బోరో భావోద్వేగాలను పట్టలేకపోయింది. అక్కకి నన్ను చూడగానే చాలా సంతోషం వేసింది. దాంతో దాదాపు కుర్చీలోంచి పడిపోయినంత పనైంది. నేను కూడా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాను. నా సోదరిని గుర్తించడం చాలా సంతోషకరమైన అనుభూతినిచ్చింది. నేను ఆమెను చూసి 53 సంవత్సరాలు అయ్యింది అని అక్కని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story