అంతర్జాతీయం

కరోనా ఎవరినీ కనికరించదు.. : బ్రెజిల్ అధ్యక్షుడు

కరోనా ఎవరినీ కనికరించదు.. : బ్రెజిల్ అధ్యక్షుడు
X

ప్రపంచం మొత్తాన్ని కరోనా కలవరపెడుతోంది. సామాన్యుల నుండి మొదలు అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో రక్షిణ రియో గ్రాండే దో సుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడక తప్పదని ఆయన పేర్కొన్నారు. వైరస్ ఎవరినీ వదిలిపెట్టదు. అయితే దాన్ని ధైర్యంగా ఎదుర్కొవడం ఒక్కటే మార్గం అని చెప్పుకొచ్చారు. అయితే కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేసిన బోల్సొనారో వైరస్ వచ్చిన తొలినాళ్లలో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని లాక్ డౌన్ ని వ్యతిరేకించారు.

జూలై 7న ఆయన కరోనా సోకింది. 20 రోజులకు పైగా ఐసోలేషన్ లో ఉండి అధికారికి నివాసం నుంచే కార్యకలాపాలు చక్కబెట్టారు. నెగిటివ్ వచ్చిన తరువాత ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చారు. కానీ అంతలోనే ఆయన భార్య మిచెల్ కు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అలాగే ఆయన ఇద్దరు సహాయకులకు కూడా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ లో ఐదుగురు క్యాబినెట్ మంత్రులు వైరస్ బారిన పడ్డారు. కాగా బ్రెజిల్ లో కోవిడ్ కేసులు 2,662,485 నమోదైతే, 92,475 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

Next Story

RELATED STORIES