ఆంధ్రప్రదేశ్

విశాఖలో మరో అగ్నిప్రమాదం

విశాఖలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం విజయశ్రీ పార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. పెద్ద శబ్ధాలతో పేలుడు సంభవించింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడ్డాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి రావడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పేలుడు దాటికి రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. విశాఖలో వరుస ప్రమాదాలు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

Next Story

RELATED STORIES