తాజా వార్తలు

ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
X

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న ఏపీ ప్రభుత్వం నిర్మాణాని వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని.. టెండర్ ప్రక్రియను నిలిపివేసేశాలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో తెలిపారు. కాగా.. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి క‌ృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణం చేపడితే, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. పలు ప్రాజెక్టులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతిలేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కృష్ణాబోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. బుధవారం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి సమస్యను పరిస్కరించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. అయితే, సీఎం కేసీఆర్ కు బుధవారం పలు కార్యక్రమాలు ఉండటంతో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కుదరలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియపై ముందుకెళ్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్న ఈనేపథ్యంలో నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మరో రెండ్రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశముందని సమాచారం.

Next Story

RELATED STORIES