అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 3.0కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ యోగా ట్రైనింగ్ సెంటర్లు, సిమ్‌లు బుధవారం నుంచి అనుమతి ఇవ్వనుంది. అటు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించారు. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతి లేదు. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లకు కూడా అన్‌లాక్ 3.0లో అనుమతి ఇవ్వలేదు. కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story