ఆంధ్రప్రదేశ్

ఇంట్లోనే ఉన్నా.. ఇంటికి వచ్చిన కరోనా: స్మిత

ఇంట్లోనే ఉన్నా.. ఇంటికి వచ్చిన కరోనా: స్మిత
X

కరోనా మహమ్మారి ఎప్పుడు, ఎలా, ఎవరికి సోకుతుందో అర్థంకాని పరిస్థితి. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ గాయని హాయ్ రబ్బా స్మితకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్మిత ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

నిన్న నాకు బాడీ పెయిన్స్ అనిపించాయి. విశ్రాంతి లేకుండా పని చేయడం వల్లే ఇలా అయిందనుకున్నా.. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది.. నాతో పాటు నా భర్త శశాంక్ కి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుని కరోనాని జయిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక ప్లాస్మాదానం చేసేందుకు సంసిద్ధులమవుతాం అని చెప్పింది. బయటకు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉన్న కరోనా మా ఇంటికి వచ్చింది అని స్మిత ట్వీట్ చేసింది.

Next Story

RELATED STORIES