భారీగా చెల్లిస్తున్నారు.. బయటకు వెళ్లకండి: బ్రెట్ లీ

హోటల్ గదిలో ఉండి గిటార్ వాయించండి.. పేకాట ఆడుకోండి.. బయటికి మాత్రం వెళ్లకండి.. ఇలాంటి సమయంలో కూడా భారీగా ఖర్చుపెట్టి ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. ఆటగాళ్లకు కూడా భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. కనుక మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. బయటకు వెళ్లి కరోనా బారిన పడవద్దు అని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ సూచిస్తున్నాడు. ఎట్టకేలకు ఐపీఎల్ పదమూడో సీజన్ యూఏఈలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. క్రికెటర్లు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దాదాపు రెండు నెలల పాటు హోటల్ గదిలోనే గడపాల్పి వస్తుంది. కానీ తప్పదు ఆ సమయంలో విసుగు చెందకుండా గిటార్ నేర్చుకోమని, పేకాట ఆడమని బ్రెట్ లీ ఆటగాళ్లకు సలహా ఇస్తున్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటకు వెళ్లి తప్పుచేస్తారని నేను అనుకోవట్లేదని అన్నారు. వాళ్ల గురించే కాకుండా, అభిమానుల గురించి కూడా ఆలోచించాలి. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్లు ఆ ఆనందానికి దూరమయ్యారు. ఆటగాళ్లు తగిన జాగ్రత్తలు పాటించి ఐపీఎల్ ను పూర్తి చేస్తారని బ్రెట్ లీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com