లెబనాన్‌కు మరోసారి చేయూతనందించనున్న భారత్

లెబనాన్‌కు మరోసారి చేయూతనందించనున్న భారత్

లెబనాన్ కు భారత్ మరోసారి చేయూనందిస్తుంది. కరోనాతో తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటున్న లెబనాన్ కు గతంలో వైద్య పరికరాలు అందించిన విషయం తెలిసిందే. లెబనాన్ రాజధాని బీరూట్ లో పేలుడు సంభవించి 150 మంది మృతి చెందారు. ఈ నేపత్యంలో మరోసారి భారత్ మానవ వనరులను పంపించేందుకు సిద్దమైంది. అమెరికాలోని భారత శాశ్వత ప్రతినిథి టీఎస్ త్రిపాఠి ఈమేరకు ప్రకటించారు. లెబనాన్ లో జరిగిన విషాదానికి భారత్ విచారం వ్యక్తం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన అనంతరం స్థానిక ప్రజలు, అధికారులు స్పందించిన తీరు ప్రశంసనీయమని అన్నారు. ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పని చేశారని అన్నారు. వారిక తోడ్పడేందుకు భారత్ నుంచి మానవ వనరులను పంపిస్తామని అన్నారు. ఈ విషయంమై భారత ప్రభుత్వం.. లెబనాన్ ప్రభుత్వంతో మాట్లాడుతుందని తెలిపారు. కాగా..ఈ నెల ఆగస్టు 4వ తేదీన బీరుట్‌ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 158 మంది మృతిచెందారు. 6 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ భారీ పేలుళ్ల ధాటికి నగరంలోని సగానికిపైగా కట్టడాలు దెబ్బతినడంతో వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 2,750 మెట్రిక్‌ టన్నుల నైట్రేట్‌ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు లెబనాన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story