అంతర్జాతీయం

అమెరికా తరువాత రెండో స్థానం భారత్‌దే: ట్రంప్

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని అమెరికా అద్యక్షుడు ట్రంప్ అన్నారు. కచ్చితంగా వ్యాక్సిన్ అనుకున్న సమయానికి వస్తుందని బలంగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ప్రపంచంలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేసిన దేశం తమదేనని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో 65 మిలియ‌న్ల మందికి ప‌రీక్ష‌లు చేశామన్నారు. అమెరికా తరువాత భారత్ లో ఎక్కువ టెస్టుల జరిగాయని అన్నారు. అయితే, కరోనా పరీక్షల విషయంలో అమెరికాకు దగ్గరలో ఏదేశం కూడా లేద‌న్నారు. చైనా వైఖ‌రి ప‌ట్ల ట్రంప్ మరోసారి అస‌హ‌నం వ్యక్తం చేశారు. చైనా మంచి చేయ‌లేద‌న్నారు. ఒకవేళ ఎన్నికల్లో తాము గెలిస్తే.. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటుంద‌ని ట్రంప్ తెలిపారు. చైనాతో డీల్ చేసుకోవాలా వ‌ద్దా అన్న అంశంలో సందేహం నెల‌కొన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Next Story

RELATED STORIES