కరోనా ప్రభావం: సగం యువత మానసిక ఆందోళన

కరోనా ప్రభావం: సగం యువత మానసిక ఆందోళన

కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. కరోనా కారణంగా యువత కుంగుబాటుకు లోనవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఓ సర్వే ద్వారా తెలిపింది. ‘యువత - కొవిడ్‌19 : వారి ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక స్థితిపై ప్రభావం’ పేరుతో ఆసర్వే నివేదికలను ఐఎల్ఓ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు యువతకు భరోసా కల్పించాలని.. లేకుంటే వారు మరింత కుంగుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని సర్వే ద్వారా తెలిపింది. మొత్తం 112 దేశాల్లో 18 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉన్న 12 వేల మంది విద్యావంతులైన యువత అభిప్రాయాలను సేకరించింది. అయితే, ఇందులో సగం మంది కరోనా సంక్షోభానికి మానసికంగా ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది. అదనంగా మరో 17శాతంమంది దాని ప్రభావానికి లోనవుతున్నారు.

ఉద్యోగాలు పోయాయని కొందరు.. ఉద్యోగాలు పోతాయేమో అని మరి కొందరు, జీతాల్లో కోతలు పడుతున్నాయని ఇంకొందరు, ఉద్యోగ అవకాశాలు కనిపించడంలేదని మరి కొందరు, ఈ ఏడాది ఫెయిల్ అవుతామేమో అని ఇంకొందరు ఇలా ఏదో ఒక కారణంతో కుంగిపోతున్నారు. దీని ప్రభావం ఎక్కువగా 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉన్న యువతపై పడింది. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల యవత ఈ ప్రాభావానికి లోనైయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story