మరో కేంద్రమంత్రికి కరోనా

X
కేంద్రమంత్రులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే కరోనా నలుగురు మంత్రులకు కరోనా సోకగా.. తాజా కేంద్రమంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే తనకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని తేలిందని అన్నారు. ఈ రోజు కరోనా పరీక్ష చేపించుకున్నానని.. ఈ పరీక్షలో తనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిందని ఆయన తెలిపారు. కరోనా సోకినా.. ఇప్పటి వరకూ వైరస్ లక్షణాలు కనిపించలేదని అన్నారు. కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లానని తెలిపారు. గత కొన్ని రోజుల్లో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. ఎవరినీ కలవకుండా ఉండాలని మంత్రి కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
