ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా
X

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకి కరోనా సోకింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అనారోగ్యంతో బాధపడటంతో గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు.

Next Story

RELATED STORIES