అసోంలో వరదల వలన 112కి చేరిన మృతుల సంఖ్య

అసోం రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వదరల వలన మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల వల్ల మృతుల సంఖ్య 112కు పెరిగింది. నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాల్లో 56,89,584 మంది వరదల బారిన పడ్డారు. పలు జిల్లాల నుంచి 13,205 మందిని సురక్షితప్రాంతాలకు తరలించారు. వరదల ప్రభావానికి గురై బాధితులకు సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. లక్షల ఎకరాలల్లో పంట నష్టం జరిగింది. కాగా.. వరదలకు తోడు అసోంలో ఈ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రతీరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నారు. శుక్రవారం 2,706 కేసులు నమోదవ్వగా.. అసోంలో కరోనా బాధితుల సంఖ్య 74,501కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంతబిశ్వా శర్మ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com