తాజా వార్తలు

తెలంగాణలో 90వేలు దాటిన కరోనా బాధితుల సంఖ్య

తెలంగాణలో 90వేలు దాటిన కరోనా బాధితుల సంఖ్య
X

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడంలేదు. గడిచిన 24 గంటల్లో 1863 మందికి క‌రోనా పాజిటివ్‌ అని తేలింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 90,259కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 66,196 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 23,376 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజు కరోనాతో 10 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటికరకూ కరోనాతో 684 మంది మ‌ర‌ణించారు. కాగా తెలంగాణలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతుండగా.. రికవరీ రేటు పెరుగుతుంది. రాష్ట్రంలో మ‌ర‌ణాల రేటు 0.75 శాతంగా, రికవరీ రేటు శాతం 73.34 శాతంగా నమోదైంది.

Next Story

RELATED STORIES