నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం

నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం
X

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చెన్నైలోని ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాలు ఆరోగ్యం ప్రసుత్తం నిలకడగా ఉందని ప్రకటించారు. అయితే, ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నామని వైద్యులు తెలిపారు. ఎస్పీ బాలుకి కరోనా సోకడంతో చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఆయనకు పెద్దగా కరోనా లక్షణాలు లేవు. కానీ, ఉన్నట్లుండి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో బాలుని ఐసీయూకి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, సామాన్యులు అందరూ ట్వీట్లు చేశారు.

Next Story

RELATED STORIES