జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

X
TV5 Telugu15 Aug 2020 7:29 PM GMT
జాతీయ రహదారి 65పై ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన డీసీఎం వ్యానును రహదారిపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అభి (30), రేణుక(28) లకు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కృష్ణ తలకు గాయమైంది. వీరంతా హైదరాబాద్ ఈసీఐఎల్ కు చెందిన వారు. విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. సమాచారం అందుకున్న కట్టంగూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ బాధితుడిని నార్కెట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలసత్వం, అధికవేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story