కదిరిలో హైటెన్షన్

కదిరిలో హైటెన్షన్
సీఐ మధు రౌడీయిజం చేస్తున్నారని మండిపడుతున్న టీడీపీ నేతలు

సత్యసాయి జిల్లా కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఐ మధు రౌడీయిజం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగు మహిళలపై లాఠీ ఛార్జ్ చేయడంతో మీసం మెలేసీ తొడగొట్టి రెచ్చగొట్టేలా వ్యవహరించిన ఆయన్ను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి డిమాండ్‌ చేశారు. వైసీపీ కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడ్డ టీడీపీ నేతల్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు పరిటాల సునీత. మహిళలపై సీఐ దారుణంగా లాఠీ ఛార్జ్ చేయడంపై మండిపడ్డారు. మహిళా కానిస్టేబుల్ లేకుండా మహిళలను కొట్టారని చోట లాఠీలతో కొట్టారంటూ ఫైర్‌ అయ్యారు. సీఐ మీసాలు తిప్పుతూ తొడలు కొట్టడమేంటని ప్రశ్నించారు. గతంలోనూ సీఐ మధు ఇలాగే ప్రవర్తించారన్నారు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం కొనసాగుతుందన్నారు.

సిఐ మధు మహిళలపై ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఇది అనాగరికమన్న ఆయన సీఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ శ్రేణులను వెంటబెట్టుకొని టీడీపి కార్యకర్తలపై దాడి చేయించడం మండిపడ్డారు. చిరు వ్యాపారస్తులకు అండగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్‌ను సీఐ మధు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారంటూ ఫైర్‌ అయ్యారు బీకే పార్థసారథి. మహిళలను దుర్భాషలాడిన సీఐ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన్ను సస్పెండ్‌ చేయాలన్నారు. గొడవ దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టుల మొబైల్ ఫోన్స్ ను ధ్వంసం చేయడంపైనా ఆయన మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story