ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 1,217 కేసులు.. 13 మరణాలు..!

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 టెస్టులు చేయగా, 1,217 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 1,217 కేసులు.. 13 మరణాలు..!
X

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 టెస్టులు చేయగా, 1,217 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 13 మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతిచెందగా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 200,1255కి చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 13,715కి పెరిగింది. కొత్తగా మరో 1535 మంది బాధితులు వైరస్‌నుంచి కోలుకోవడంతో రికవరిల సంఖ్య 19,72,399కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,141 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Next Story

RELATED STORIES