ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు.. 18 మంది మృతి

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు కాస్త పెరిగాయి.

ఏపీలో కొత్తగా  2,672 కరోనా కేసులు.. 18 మంది మృతి
X

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,594 పరీక్షలు నిర్వహించగా, 2,672 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,37,122కి చేరింది. ఇక కరోనా బారిన పడి మరో 18 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 13,115కి చేరింది. ఇక కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో 2,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు 2,34,88,031 టెస్టులు నిర్వహించింది ప్రభుత్వం.. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Next Story

RELATED STORIES