ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు, 35 మరణాలు

ఏపీలో కరొనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 93 వేలా 759 మందిని పరీక్షించగా 3 వేల 464 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు, 35 మరణాలు
X

ఏపీలో కరొనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 93 వేలా 759 మందిని పరీక్షించగా 3 వేల 464 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 38 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 18 లక్షల 96 వేలా 818 కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 37వేలా 323 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు మరణాల్లోనూ స్పల్ప తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 38 మరణించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు కరోనాతో మృతిచెందగా.. తూ.గో., గుంటూరు జిల్లాలో నలుగురు చొప్పున.. కృష్ణ, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చొప్పున మృతిచెందారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 667 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Next Story

RELATED STORIES