రైతన్న టాలెంట్‌‌‌‌కి హ్యాట్సాఫ్... గడ్డి పరకలతో ఆరుగజాల చీర..!

రైతన్న టాలెంట్‌‌‌‌కి హ్యాట్సాఫ్... గడ్డి పరకలతో ఆరుగజాల చీర..!
ప్రతి ఒక్కరికి ఏదోక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటో బయటపెట్టినప్పుడే మనం ఏంటన్నది ప్రపంచానికి తెలుస్తుంది. ఇక్కడో ఇంకో విషయం ఏంటంటే.. టాలెంట్ కి చదువుకి ఎలాంటి సంబంధం లేదు.

ప్రతి ఒక్కరికి ఏదోక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటో బయటపెట్టినప్పుడే మనం ఏంటన్నది ప్రపంచానికి తెలుస్తుంది. ఇక్కడో ఇంకో విషయం ఏంటంటే.. టాలెంట్ కి చదువుకి ఎలాంటి సంబంధం లేదు. చదుకున్న వారే అద్భుతాలు సృస్టిస్తారని కాదు. చదువురాని వారు కూడా ఎన్నో వండర్స్ క్రియేట్ చేయగలరు.. అందుకు చక్కటి ఉదాహరణే ఈ తెలుగు రైతు.. మొవ్వా కృష్ణమూర్తి..

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంకి చెందిన మొవ్వా కృష్ణమూర్తికి డెబ్బై ఏళ్ళు.. ఆయనో సాధారణ రైతు.. చదువుకున్నది అయిదో తరగతి మాత్రమే.. చిన్న నాటి నుంచి స్వయంకృషితో వివిధ వస్తువులను తయారు చేయడం ఆయనకి అలవాటు.. జనపనార, ఊలు సహా వివిధ వస్తువులతో తాళ్లు అల్లటం నేర్చుకున్నారు. అందులో కొన్నింటినీ నలుగురినీ మెప్పించాలని పోటీకి కూడా తీసుకెళ్లేవారు. ఈ నేపధ్యంలో ఒకసారి పోటీలో తనతో సమానంగా నిలిచిన వ్యక్తిని అధిగమించాలనే ఉద్దేశంతో గడ్డితో చీర చేయాలనే ఆలోచన ఆయనకి నలబై ఏళ్ల క్రితం వచ్చిందట.


అప్పుడు గడ్డితో చేసిన కండువాకి చాలా బహుమతులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసి మరికొన్ని చేయాలని సూచనలు చేసింది. కొన్నాళ్లకు ఆ జిల్లాకి కలెక్టర్‌గా వచ్చిన ఉదయలక్ష్మి ప్రోత్సాహంతో 40 అంగుళాల పొడవు, 20 అంగుళాల వెడల్పుతో జాతీయ జెండా రూపొందించారు. దీనికి గాను వ్యవసాయ శాఖ వారు అవార్డు కూడా లభించింది. జెండాకి మంచి పేరు రావడంతో పెద్ద చీరను తయారు చేయాలని ఆలోచించారు. కానీ అది ఆయనకీ చాలా కఠిన పరీక్షగానే సాగిందట.. అయినప్పటికీ పట్టుదలతో చీర నేయడం పూర్తి చేశారు. ఆ తర్వాత దానికి ఎంతో కష్టపడి రంగులద్దారు.

దీనిని దేశమంతా వివిధ ప్రదర్శనల్లో ఉంచితే, అందరూ అభినందించారు. అంతా అనదంగానే ఉంది కానీ ప్రభుత్వం నుంచి తనకు ఎలంటి సహకారం లేదని మొవ్వా కృష్ణమూర్తి వాపోతున్నారు. పత్తి, ఊలు లాంటి ముడిసరుకునే కాకుండా గడ్డితో కూడా సిద్ధం చేయవచ్చని రుజువు చేసిన తనకు అభినందనలు, అవార్డులు తప్ప ఆర్థికంగా ఆదుకునేందుకు పెన్షన్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. మొదట్లో చాలా మంది తనని నిరాశపరిచినా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రయత్నం చేశానని, ఈ రోజు తానూ నేసిన చీర అమెరికా వరకూ వెళ్లిందని అంటున్నారు.



ఇలాంటి కళను పదిమందికి చేర్చాలని చాలా మంది తనతో శిక్షణ ఇప్పించారని కృష్ణమూర్తి అన్నారు. నేర్చుకోవడానికి ఓపిక ఉంటే.. తర్వాతి తరాలకు కూడా ఈ విభిన్న వస్తువులు తయారుచేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి కళాకారుడిని ప్రభుత్వం కూడా గుర్తించి ఈ అరుదైన కళను భావి తరాలకు అందించే ఏర్పాట్లు చేయాలని గ్రామస్థులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story