ఆంధ్రప్రదేశ్

Guntur crime : గుంటూరు జిల్లాలో కీచక వాలంటీర్.. కామవాంఛ తీర్చాలంటూ బాలింతకు వేధింపులు..!

Guntur crime : ప్రజాసేవకు పాటు పడాల్సిన ఓ వలంటీర్‌ వక్రబుద్ది చూపించాడు. బాలింతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Guntur crime :  గుంటూరు జిల్లాలో కీచక వాలంటీర్.. కామవాంఛ తీర్చాలంటూ బాలింతకు వేధింపులు..!
X

Guntur crime : ప్రజాసేవకు పాటు పడాల్సిన ఓ వాలంటీర్ వక్రబుద్ది చూపించాడు. బాలింతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో వాలంటీర్‌‌గా పనిచేసే గోపీ.. ఓ బాలింతను కామవాంఛ తీర్చాలంటూ వేధించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి వచ్చి బలవంతం చేయబోయాడు. దీంతో బాధితురాలు పాలు తాగుతున్న బిడ్డను వదిలి బయటకు పరుగులు తీసింది. ఈ విషయం ఊర్లో వారికి చెబితే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు తెగబడ్డాడు. వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించించింది. వాలంటీర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మాచవరం ఎస్‌ఐ కోటయ్య తెలిపారు.

Next Story

RELATED STORIES