బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే టీడీపీ నాయకులపై కేసులా? : అచ్చెన్నాయుడు

బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే టీడీపీ నాయకులపై కేసులా? : అచ్చెన్నాయుడు
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నాయకులపైనే తిరిగి కేసులు పెట్టడం దారుణమన్నారు.

సీఎం సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ టీడీపీ అధ్యకుడు అచ్చెన్నాయుడు. దళిత మహిళ హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నాయకులపైనే తిరిగి కేసులు పెట్టడం దారుణమన్నారు. దళిత కుటుంబానికి అండగా చలో పులివెందులకు పిలుపు ఇచ్చిన ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఎలా అరెస్ట్ చేస్తారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

బీటెక్‌ రవిని చెన్నైలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఛలో పులివెందుల కార్యక్రమం సందర్భంగా పలువురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ రవిని అరెస్ట్‌ చేయడంపై నిరసనకు దిగారు టీడీపీ నేతలు. లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ నాగమ్మ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్పీ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. దీనిపై తమకు పరువునష్టం జరిగింది అంటూ నాగమ్మ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 21 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన పోలీసులు.. ఈ కేసులో భాగంగా ఎంల్‌ఎసీ బీటెక్‌ రవిని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story