Andhra Pradesh CAG Report 2021: ఏపీలో బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిన ఖర్చు: కాగ్ రిపోర్ట్

Andhra Pradesh CAG Report 2021: ఏపీలో బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిన ఖర్చు: కాగ్ రిపోర్ట్
Andhra Pradesh CAG Report 2021: 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను కాగ్ రిపోర్ట్‌ను వైసీపీ సర్కార్ శాసనసభలో ప్రవేశపెట్టింది

Andhra Pradesh CAG Report 2021: 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను కాగ్ రిపోర్ట్‌ను వైసీపీ సర్కార్ శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఆర్థికస్థితిని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కేంద్రం నంచి పొందే గ్రాంట్లు 12.43శాతం పెరిగినట్లు కాగ్ పేర్కొంది.

2018-19 ఏడాదితో పోలిస్తే.. రాష్ట్రంలో నగదు నిల్వలు 6 వేల 305 కోట్ల మేర పెరిగినట్లు కాగ్ తెలిపింది. శాసనసభ ఆమోదించిన బడ్జెట్ అంచనాల కంటే అధికంగా ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది.

ఐదేళ్లుగా చెబుతున్నా సర్కార్ తీరులో మార్పలేదని వెల్లడించింది. అటు 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2019-20లో రెవెన్యూ రాబడులు తగ్గాయని తెలిపింది. అటు సీఎఫ్ ఎంఎస్ లావాదేవీలు.. ప్రభుత్వ పద్దులకు మధ్య 54వేల 5వందల 22 కోట్ల మేర వ్యత్యాసం ఉన్నట్లు కాగ్ వెల్లడించింది.

ఆహార సబ్సిడీ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చిన 4వేల 9 వందల 68కోట్లలో 3వేల 3 వందల 43కోట్లు ఇతర ప్రయోజనాలకు మళ్లించినట్లు కాగ్ పేర్కొంది. అమ్మఒడి, వైఎస్‌ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ లాంటి నూతన పథకాలతో సొంత రాబాడులు తగ్గి.. రెవెన్యూ లోటు పెరిగినట్లు కాగ్ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story