AP ASSEMBLY: అసెంబ్లీలో తొడగొట్టిన బాలయ్య

AP ASSEMBLY: అసెంబ్లీలో తొడగొట్టిన బాలయ్య
రా చూసుకుందాం అని మీసం మెలేసిన బాలకృష్ణ.... తాము మీసం మెలేస్తామన్న వైసీపీ ఎమ్మెల్యేలు...

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. టీడీపీ సభ్యులతోపాటు ఇటీవల వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ పోడియం వద్దకు చేరి, నిరసనకు దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నిరసనల్లో పాల్గొన్నారు. సభలో మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారంటూ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆరోపించింది. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించాలని అంబటి వ్యాఖ్యానించారు.


హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై అంబటి రాంబాబు మండిపడ్డారు. మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూపించుకోవాలని బాలకృష్ణను అంబటి అన్నారు. దీంతో ఫైర్ అయిన బాలకృష్ణ ‘చూసుకుందాం రా’ అంటూ అంబటికి సవాల్ విసిరారు. అంబటి సైతం ‘రా చూసుకుందాం’అని ప్రతి సవాల్ విసిరారు. అంబటి సవాల్‌కు బాలకృష్ణ మీసం మెలేసి తొడిగొట్టారు. దీంతో తామూ మెలేస్తాం అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది

ప్రారంభం అయ్యి అవగానే ఏపీ అసెంబ్లీ హాట్ హాట్‌గా నడిచింది. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లి అవాంఛనీయంగా వ్యవహరిస్తున్నారని ఏపీ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మిగిలిన సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాబట్టి వారిపై వెంటనే చర్చలు తీసుకోవాలన్నారు. లేకపోతే తమ సభ్యులు కూడా అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో తమ సభ్యులు కూడా రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు. అంబటి వ్యాఖ్యలతో ఏపీ అసెంబ్లీ రసాభాసగా మారింది. దీంతో అసెంబ్లీలో స్పీకర్ మైక్‌లు కట్ చేసి.. సభకు విరామం ప్రకటించారు అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆ అంశంపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు ప్లకార్డులతో వెళ్లి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులపైకి వైకాపా సభ్యులు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితులతో సభలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story