జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు కేసు : రేపే తీర్పు

ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కేసులో రేపటి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది..

జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు కేసు : రేపే తీర్పు
X

ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కేసులో రేపటి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.. బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై ఇప్పటికే విచారణ పూర్తిచేసిన సీబీఐ న్యాయస్థానం రేపు తీర్పు చెప్పబోతోంది.. దీంతో న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఏంటన్న దానిపై ఆసక్తి నెలకొంది.. అయితే, రేపు తీర్పు వస్తుందనగా ఎంపీ రఘురామ మరో భారీ ట్విస్ట్‌ ఇచ్చారు.. సీబీఐ కోర్టు తీర్పు వెలువరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.. దీంతో రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాన్నది ఉత్కంఠ భరితంగా మారింది.

సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని విచారణ బెంచ్‌ను మార్చాలని ఆయన రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంత వరకూ తీర్పును వాయిదా వేయాలని హైకోర్టును కోరారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో రేపటి CBI న్యాయస్థానం తీర్పు నిష్పాక్షికంగా ఉంటుందా లేదా అనే సందేహం తనకు వచ్చిందని రఘురామ అంటున్నారు. జగన్‌ మీడియా తప్పుడు ప్రచారంతో, ఆ తీర్పు ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. నిష్పాక్షికమైన తీర్పు కోసం దీన్ని మరో బెంచ్‌కు బదిలీ చేయాలంటూ కోరారు. ఈ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.

Next Story

RELATED STORIES