రూ.56,076 కోట్ల అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్రం.. !

రూ.56,076 కోట్ల అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్రం.. !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా అప్పుల తీసుకున్న విషయాన్ని కేంద్రం కూడా నిర్థారించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా అప్పుల తీసుకున్న విషయాన్ని కేంద్రం కూడా నిర్థారించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఏపీకి భారీగా బడ్జెట్‌యేతర అప్పులు ఉన్నాయన్న కేంద్రం.. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్లు, కంపెనీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 56 వేల 76 కోట్లు అప్పుచేసిందన్నారు. ఈ రుణాలు అత్యధికంగా ఎస్‌బీఐ నుంచి తీసుకున్నట్టు తెలిపింది. SBI నుంచి ఏకంగా 15 వేల 47 కోట్లు, ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 9 వేల 450 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల 75 కోట్లు అప్పు తెచ్చారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 2 వేల 800 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి 2వేల 307 కోట్లు రుణం పొందారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా 6 వేల 800 కోట్ల రుణాల్ని సమీకరించారు.

ఈ అప్పుల పరిస్థితిపై ఆర్థికవేత్తలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఎవరూ వ్యతిరేకం కాదని.. పారదర్శకంగా వాటి అమలు ఉంటేనే మేలని చెప్తున్నారు. ఇష్టారాజ్యంగా చేస్తున్న ఈ అప్పులతో భావి తరాలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలసరి అప్పు పెరిగితే ఆర్థిక పరిపుష్టి ఎప్పటికి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులే లక్ష కోట్ల వరకు వున్నాయని.. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం ఇప్పట్లో గట్టెక్కే అవకాశమే లేదని వారంటున్నారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితిని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు.

అటు విపక్షాలు సైతం ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. రాష్ట్రంపై అప్పుల కుప్ప పెట్టారంటూ ఫైరవుతున్నాయి.. ఎఫ్‌ఆర్‌డీఎం చట్టానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైరవుతున్నాయి.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు టైమ్‌కు ఇవ్వడం లేదని మండిపడుతున్నాయి.. చివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించదనే అభిప్రాయం కాంట్రాక్టర్లలో, కంపెనీల్లో ఉండిపోయిదని.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంటే కంపెనీలు ఎలా వస్తాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.. ఓటు బ్యాంకు రాజకీయాలపై పెడుతున్న దృష్టి అభివృద్ధిపై పెట్టడం లేదని విమర్శిస్తున్నాయి.. ప్రతిపక్షాలపై కక్షా సాధింపులే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడుతున్నాయి.. రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్రం ఎంత త్వరగా దృష్టిపెడితే అంత మంచిదంటున్నాయి.. కేంద్రం జోక్యం చేసుకోకుంటే రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందంటున్నాయి విపక్షాలు.

Tags

Read MoreRead Less
Next Story