చదువుల తల్లికి న్యాయం జరిగింది..

చదువుల తల్లికి న్యాయం జరిగింది..
కూలి పనులు చేస్తూ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌ సాకే భారతి కష్టం ఫలించింది.

కూలి పనులు చేస్తూ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌ సాకే భారతి కష్టం ఫలించింది. తను నమ్ముకున్న చదువు ఈ రోజు తనకు పేరు ప్రఖ్యాతులతో పాటు కొండంత అండను ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం భారతికి 2 ఎకరాల స్థలం కేటాయించింది. జిల్లా కలెక్టర్ గౌతమి భూమి పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువు మీద ఆసక్తితో ఎన్నో కష్టాలు పడుతూ, కూలి పనులకు వెళుతూ కూడా చదువుకోవడం నిజంగా అభినందనీయం. భారతీ ఎస్కే యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమన్నారు.

సంకల్పం ఉంటే విజయం సిద్ధిస్తుందని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుకు వేయకుండా తన లక్ష్యాన్ని పూర్తి చేసి యువతకు రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. ఎంతో కష్టమైన కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద పీహెచ్‌డీ చేయడం భారతికే సాధ్యమైందని అన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి సాకే భారతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తమ వంతు సాయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని కలెక్టర్ భారతికి హామీ ఇచ్చారు.

భారతి ఉద్యోగం చేస్తానంటే కూడా ఇస్తామని కలెక్టర్ తెలియజేశారు. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story