AP Weather: ఏపీలో దట్టమైన పొగమంచు.. అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఇదే..

AP Weather: ఏపీలో దట్టమైన పొగమంచు.. అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఇదే..
AP Weather: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత భారీగా పెరిగిపోయింది.

AP Weather: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏపీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో పొగమంచు కమ్మేసింది. తీవ్ర చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒంగోలు-నంద్యాల, ఒంగోలు-శ్రీశైలం, పొదిలి-అద్దంకి రహదార్లలో పొగమంచు అలుముకోవడంతో రోడ్డు పక్కనే వాహనాలు నిలిపివేశారు.

గన్నవరం ఎయిర్‌ పోర్టులోనూ దట్టమైన పొగ మంచు అలుముకుంది. రన్‌వే కూడా కనిపించని పరిస్థితి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా, బెంగుళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఇటు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story