AP Liquor Policy: ఏపీలో ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి మద్యం షాపులు..?

AP Liquor Policy: ఏపీలో ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి మద్యం షాపులు..?
AP Liquor Policy: మద్యనిషేధంపై పూర్తిగా మడమ తిప్పేస్తున్నారు సీఎం జగన్.

AP Liquor Policy: మద్యనిషేధంపై పూర్తిగా మడమ తిప్పేస్తున్నారు సీఎం జగన్. త్వరలో ప్రైవేట్‌ వ్యాపారులకే మద్యం షాపులు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మద్యాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రభుత్వమే షాపులు నడుపుతుందని చెప్పుకొచ్చిన జగన్.. ఆ దారి నుంచి పక్కకు తప్పుకునేలా కనిపిస్తున్నారు. మరో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా ఇకపై ప్రైవేట్ వాళ్లకే మద్యం షాపులు అప్పగిస్తారని తెలుస్తోంది. స్టార్‌ హోటళ్లలో తప్ప రాష్ట్రంలో మరెక్కడా మద్యం అమ్మకాలు జరక్కుండా చూస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో కూడా పెట్టారు.

వచ్చే ఎన్నికల నాటికి మద్యనిషేధం చేయకపోతే ఓట్లు అగడను అంటూ ప్రతిజ్ఞ చేశారు. కాని, పరిస్థితి చూస్తుంటే.. మద్యనిషేధం హామీపై జగన్‌ మాట తప్పేలానే కనిపిస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, మద్యం షాపులపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమీక్షలో మద్యం దుకాణాలను మళ్లీ ప్రైవేటు వ్యాపారులకే అప్పగించాలనే ప్రతిపాదన వచ్చినట్టు, జగన్‌ కూడా అందుకు అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే.. ఇక ఏపీలో మద్య నిషేధం అనేదే ఉండదు.

జగన్ ఇచ్చిన మాట తప్పినట్టే. జగన్‌ సర్కార్‌కు మద్యం ద్వారా వచ్చే ఆదాయం చాలా కీలకం అంటున్నారు కొందరు అధికారులు. అమ్మ ఒడి, చేయుత, విద్యాదీవెన వంటి పథకాలు అమలు చేయాలన్నా, జీతాలు, చెల్లింపులు చేయాలన్నా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం అని చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జగన్ ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మింది. ఈ అమ్మకాల వల్ల 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాని, ఈ ఆదాయం సరిపోదని, మద్యం వ్యాపార పరిమాణం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నందున ఎక్కువ ఆదాయం రాబట్టలేకపోతున్నామని ఎక్సైజ్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి.

ఒకవేళ ప్రైవేటు వ్యాపారులకు గనక దుకాణాల నిర్వహణ అప్పగిస్తే.. కమీషన్‌ సొమ్ము కోసం వివిధ మార్గాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని, ప్రభుత్వానికి కూడా మరో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని వివరించారు. అందుకే, సీఎం జగన్‌ కూడా మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళల మాంగళ్యాలే తమకు ముఖ్యమంటూ సీఎం జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. క్రమక్రమంగా మద్యనిషేధాన్ని పక్కన పెట్టేస్తూ జనాలతో మరింత ఎక్కువగా తాగించే పనులు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story