AP Police : అనకాపల్లి డీఎస్పీ సునీల్‌పై బదిలీ వేటు

AP Police : అనకాపల్లి డీఎస్పీ సునీల్‌పై బదిలీ వేటు
విచారణలో నిజం బయటపడడంతో.. సునీల్‌పై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.

గంజాయి కేసులో పట్టుబడ్డ కారును సొంతానికి వినియోగించిన అనకాపల్లి డీఎస్పీ సునీల్‌పై బదిలీ వేటు పడింది. ఇన్‌చార్జీ డీఎస్పీగా మల్ల మహేష్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన అధికారులు.. సునీల్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

గంజాయి కేసులో సీజ్ చేసిన కారును డీఎస్పీ సునీల్ వినియోగించారు. సీజ్‌ అయిన కారు నెంబర్‌ మార్చి ఫ్యామిలీతో బీచ్‌కు వెళ్లారు. అక్కడ యాక్సిడెంట్‌ కావడంతో బండారం బయటపడింది. ఆతర్వాత కవర్ చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. విచారణలో నిజం బయటపడడంతో.. సునీల్‌పై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.

Tags

Read MoreRead Less
Next Story