అమిత్ షా విశాఖ పర్యటనపైనే అందరి దృష్టి

అమిత్ షా విశాఖ పర్యటనపైనే అందరి దృష్టి
చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత కాషాయం పెద్దల్లో స్పష్టమైన మార్పు వచ్చినట్లు వారు అర్థం చేసుకుంటున్నారు.

ఇవాళ్టి అమిత్ షా విశాఖ పర్యటనపైనే అందరి దృష్టి ఉంది. వరుసగా కమలం పెద్దలు వస్తుండడంతో… ఏపీలో రాజకీయం అమాంతం వేడెక్కింది. నిన్నటి నడ్డా విమర్శలపై ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ సర్కార్‌.. ఇవాళ అమిత్ షా ప్రసంగం ఎలా ఉంటుందోనని హడలిచస్తోంది. ఇన్నాళ్లూ సహాయసహకారాలతో కాపాడుకుంటూ వస్తున్న బీజేపీ పెద్దలు.. ఎన్నికల ఏడాదిలో భారీ పొలిటికల్‌ షాక్‌ ఇస్తుందేమోనని ఫ్యాన్‌ పార్టీలో కలవరం మొదలైంది. 9 ఏళ్ల మోదీ పాలన విజయోత్సవాల్లో అమిత్‌ షా స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని ఏపీ బీజేపీ క్యాడర్‌ భావిస్తోంది.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత కాషాయం పెద్దల్లో స్పష్టమైన మార్పు వచ్చినట్లు వారు అర్థం చేసుకుంటున్నారు. గతంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు… అత్యంత విలువైన సూచనలతో ఆకట్టుకున్నారు. కాలక్రమేణా తెలుగుదేశం ఎన్టీఏకు దూరమైంది. ఎన్టీఏ మంచి మిత్రపక్షాన్ని దూరం చేసుకుందన్న భావన కేంద్రం పెద్దల్లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… వైసీపీ సర్కార్ ప్రజా కంఠక పాలనపై.. టీడీపీతో పాటు.,. బీజేపీ, జనసేన కలిసికట్టుగా ముప్పేట దాడి చేస్తాయనే అంచనాలు వస్తున్నాయి. నిన్నటి నడ్డా స్పీచ్‌తో సగం క్లారిటీలో ఉన్న కమలం శ్రేణులకు.. ఇవాళ్టి అమిత్‌ షా విశాఖ స్పీచ్‌తో ఫుల్‌ క్లారిటీకి రానుంది. తాజా పరిణామాలు జగన్‌ శిబిరానికి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారాయి. బీజేపీని ఎదిరించలేక.. అలాగని చేతులెత్తేయలేక.. కక్కలేక, మింగలేక అన్నట్లు త్రిశంకుస్వర్గంలో ఆ పార్టీ సతమతమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story