మురళీమోహన్, కుటుంబసభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట..!

సినీ నటుడు జయభేరీ ప్రాపర్టీస్‌ ఛైర్మన్‌ మురళీమోహన్, ఆయన కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

మురళీమోహన్, కుటుంబసభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట..!
X

సినీ నటుడు జయభేరీ ప్రాపర్టీస్‌ ఛైర్మన్‌ మురళీమోహన్, ఆయన కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్థలం తీసుకుని మోసం చేసినట్లు భూ యజమాని ఫిర్యాదుతో ఏపీలో కేసు నమోదు చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. 41 ఏ సెక్షన్ కింద మురళీమోహన్‌కు నోటీసులిచ్చి... గురువారం విచారణకు హాజరుకావాలని కోరారు. సీఐడీ నోటీసులపై హైకోర్టులో మురళీమోహన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చటం పట్ల పిటిషనర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య ఒప్పందాన్ని జయభేరీ ప్రాపర్టీస్‌ ఉల్లంఘించలేదన్నతన వాదనలు వినిపించారు పిటిషనర్‌ న్యాయవాది. ఈ కేసులో అన్నిరకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story

RELATED STORIES