ఆంధ్రప్రదేశ్

Avanthi Srinivas : సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు నిరసన సెగ

Avanthi Srinivas : మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది.

Avanthi Srinivas : సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు నిరసన సెగ
X

Avanthi Srinivas : మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆనందపురం మండలం పెద్దిపాలెంకు వెళ్లిన ఆయన్ను స్థానికులంతా నిలదీశారు. డ్రైనేజీ సమస్య సహా పలు అంశాల్ని అవంతి దృష్టికి తెచ్చారు.

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మురుగునీటి సమస్య నుంచి తమను బయటపడేయలేకపోతున్నారంటూ మండిపడ్డారు. నేతలు హడావుడి పర్యటనలతో తమకు ఒరిగేదేమీ లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను కూడా వారు ప్రస్తావించారు. తాగునీటి కోసం కూడా తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు.

రోడ్డు సమస్య, కరెంటు కోతలు ఇలా ఒకటేంటి.. తాము పడుతున్న ఇబ్బందులన్నింటినీ ఏకరువు పెట్టారు. మహిళలంతా ఇలా నిలదీస్తుండడంతో ఏమీ సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు అవంతి. త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయనంటూ హామీ ఇచ్చి అక్కడి నుంచి బయటపడడ్డారు.

Next Story

RELATED STORIES