Andhra Pradesh BJP: పురందేశ్వరి పిలుపు మేరకు మహా ధర్నా

Andhra Pradesh BJP: పురందేశ్వరి పిలుపు మేరకు మహా ధర్నా
నిరసనలో పాల్గొన్న సుజనా చౌదరి, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, జనసేన నేత పోతిన మహేష్

జగన్ సర్కారు సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. జగన్ సర్కారుపై విరుచుకుపడ్డ పురందేశ్వరి సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు సర్పంచ్‌లు ఆత్మహత్య దిశగా అడుగు వేస్తున్నారంటే దీనికి జగన్ సర్కారుదే కారణమన్నారు. సర్పంచ్‌లు తీసుకొచ్చిన అప్పులు తిరిగి కట్టలేకపోతున్నారన్నారు. ఏపీ వ్యాప్తంగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు దిగింది. ఈ సందర్భంగా ఒంగోలులో ఆందోళనకు దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. మహాధర్నాకు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, సర్పంచులు హాజరయ్యారు.

అటు విజయవాడలో ధర్నాకు దిగారు బీజేపీ నేతలు. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో ఆందోళనకు దిగారు. సర్పంచ్ ల వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం.. సర్పంచ్ అకౌంట్లలో వైసీన నిధుల్ని సంక్షేమ పథకాలను మళ్లిస్తున్నారంటూ మండిపడ్డారు సుజనాచౌదరి. పంచాయితీ వ్యవస్ధలపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాతో‌ సీఎం జగన్ కోట్లు సంపాదిస్తున్నారన్నారు. పంచాయితీ నిధులు దారిమళ్లిస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు అందిందని, దీనిపై ఎంక్వైరీ జరుగుతుందన్నారు. గత నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టు తేలేదన్న సుజనా చౌదరి పరిశ్రమలు రాకుండా భయభ్రాంతులకు గురి చేసి తరిమేశారమన్నారు. రాష్ట్రంపై పడి పంది కొక్కుల్లా దోచుకుతింటున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

అటు విశాఖలోనూ ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. ఓల్డ్ జైలు రోడ్డులో మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాలో.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు. పంచాయీతి నిధులను.. పక్కదారి పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేస్తామన్నారు బీజేపీ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story