Chandrababu: తొలిసారి జంటగా ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు, పవన్

Chandrababu: తొలిసారి జంటగా ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు, పవన్
వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నాం - బాదుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తామన్న నేతలు

ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం, నెల్లిమర్లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా జగన్‌ ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామతీర్థ సాగర్‌ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీఇచ్చారు.భోగాపురం విమానాశ్రయాన్ని 2025 కల్లా పూర్తిచేస్తామన్నారు. నెల్లిమర్ల అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తయారవుతుందన్న చంద్రబాబు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో నాటకం ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఉద్యోగులు, పోలీసులనూ జగన్‌ వంచించారని ఆక్షేపించారు.

జగన్ కక్ష రాజకీయాలకు ఎంతో మంది బలయ్యారన్న చంద్రబాబు , తల్లినీ చెల్లినీ సైతం వేధించారని మండిపడ్డారు. చిరంజీవిలాంటి సినీ నటులనూ వదల్లేదన్నారు. ఏపీని గంజాయి మయం చేసిన జగన్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా.కూటమికే ఉందన్నారు. నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఎక్కువైందని కూటమి అభ్యర్థులు ఆరోపించారు. ప్రగతికి కోసం పనిచేస్తున్న...... తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిని గెలిపించాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు వారు హామీ ఇచ్చారు. జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థితి ఉందని చంద్రబాబు ఆరోపించారు. తాను సీఎంగా ఉంటే ఈపాటికే ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చేదని, కానీ వైసీపీ పాలన కారణంగా ఇప్పటికీ రాలేదని విమర్శించారు. 2 వేల 750 ఎకరాలతో భూసమీకరణ చేసి శంకుస్థాపన చేస్తే జగన్ వచ్చాక దానికి మరోసారి శంకుస్థాపన చేస్తాడు గానీ పని మాత్రం పూర్తి చేయరని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని గంజాయి మయం చేసిన జగన్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలని విజయనగరంలో పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా కూటమికే ఉందన్నారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. యువత మార్పు కావాలని కోరుకుంటుందన్న పవన్‌ కల్యాణ్, ప్రజలకు సేవా నాయకత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్నింటిలో రాష్ట్రం వెనుకంజలో ఉందని, గంజాయిలో మాత్రమే రాష్ట్రం నంబర్‌ 1గా ఉందని ఎద్దేవా చేశా

Tags

Read MoreRead Less
Next Story