ఆంధ్రప్రదేశ్

కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌

కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌
X

చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఉద్రిక్తతలు సృష్టిస్తోందన్నారు.. రౌడీయిజం, గూండాయిజానికి పాల్పడుతోందంటూ మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు సంబంధించి రెండు నెలల్లో చేయాల్సి పని రెండేళ్లవుతున్నా పూర్తిచేయకపోవడం కక్ష సాధింపు కాక మరేంటని ప్రశ్నించారు.. పోటీ ఆందోళనలు చేపట్టడం ద్వారా ఉద్రిక్తలు రెచ్చగొట్టి రైతు సమస్యల పరిష్కారానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని, ఇది ప్రజాద్రోహమేనని చంద్రబాబు అన్నారు.. టీడీపీ శాంతిని ప్రమోట్‌ చేస్తే, వైసీపీ విధ్వంసాన్ని ప్రోత్సహిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story

RELATED STORIES