Chandrababu : సీపీఎస్ ఉద్యోగులపై వేధింపులు ఆపండి : చంద్రబాబు

Chandrababu : సీపీఎస్ ఉద్యోగులపై వేధింపులు ఆపండి : చంద్రబాబు
Chandrababu : సీపీఎస్‌ ఉద్యోగుల నిరసనలపై వేధింపులు, కేసులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు

Chandra Babu : సీపీఎస్‌ ఉద్యోగుల నిరసనలపై వేధింపులు, కేసులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉద్యోగులపై బైండోవర్‌ కేసులు, వేధింపులను వెంటనే నిలిపివెయ్యాలని లేఖలోకోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీమ్‌ను తిరిగి ప్రారంభిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దె నెక్కిన జగన్‌... మూడేళ్లవుతున్నా దాన్ని నెరవేర్చలేదన్నారు.

సీఎం జగన్‌ ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చని కారణంగానే ఉద్యోగులు నిరసనల బాట పట్టాల్సి వచ్చిందన్నారు. నిరసనలు చేసే హక్కు ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కన్నారు. ఉద్యోగులు తమ శాంతియుత నిరసనను సెప్టెంబర్‌ ఒకటిని 11వ తేదీకి వాయిదా వేసినప్పటికీ పోలీసుల బెదిరింపులు, వేధింపులు కొనసాగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులపై గతంలో ఎప్పుడూ ఈ తరహా వెధింపులకు పాల్పడిన సందర్భం లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story