CDF: ఏపీలో ఓట్ల అవతవకలపై గవర్నర్‌కు ఫిర్యాదు

CDF: ఏపీలో ఓట్ల అవతవకలపై గవర్నర్‌కు ఫిర్యాదు
"జగనే ఎందుకు కావాలంటే" కార్యక్రమాన్ని నిలిపేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం నిర్వహిస్తున్న ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, ప్రభుత్వ అధికారుల్ని, సిబ్బందిని వినియోగించడాన్ని ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం తీవ్రంగా తప్పుబట్టింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమానికి ప్రభుత్వ వనరులు, సిబ్బందిని వినియోగించడాన్ని సిటిజన్‌ ఫర్‌ డెమక్రటిక్‌ ఫోరం తప్పుపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ భవానీ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.గోపాలరావు, సీఎఫ్‌డీ కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. దీనితోపాటు ఓటరు జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిటిజన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ ఫోరం ఫిర్యాదు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజకీయరంగు పులుముకున్న వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఓటర్ల జాబితా రూపకల్పన వంటి బాధ్యతల్లో కొనసాగించడం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఫల్యంగా సిటిజన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ ఫోరం అభిప్రాయపడింది. ఓటరు జాబితాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవకతవకలు చోటు చేసుకోవడానికి, తప్పులు దొర్లడానికి ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బందిని వినియోగించడమే కారణమని పేర్కొంది. గతంలో ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇన్ని తప్పులు ఎప్పుడూ దొర్లలేదని గుర్తుచేసింది. ఇప్పటికైనా ఎన్నికల జాబితాల బాధ్యతల నుంచి సచివాలయ సిబ్బందిని తొలగించి ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులకు అప్పగించాలని ECని కోరింది. ఎన్నికల జాబితాల్లో అనేక తప్పులు దొర్లాయని ఈ ఏడాది సెప్టెంబరు 8న రాసిన లేఖలో CEO స్వయంగా అంగీకరించారని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ ఫోరం పేర్కొంది. వాటిలో కొన్ని తప్పుల్ని మాత్రమే సరిదిద్దారని వివరించింది.

సీఈఓ స్వయంగా అంగీకరించిన తప్పుల్ని సరిదిద్దకుండా ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. జాబితాల్లో దొర్లిన తప్పుల్ని సరిదిద్దే బాధ్యతను మళ్లీ నిష్పాక్షికత కొరవడిన సచివాలయ సిబ్బందికే అప్పగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది. దురుద్దేశపూరింతగా ఫారం-7 దరఖాస్తులు పెట్టి తొలగించిన ఓట్లన్నింటినీ పునరుద్ధరించాలని CFD డిమాండ్‌ చేసింది. అధికార పార్టీకి మేలు చేసేందుకు జరిగిన ఓట్ల తొలగింపు కుట్రలో సచివాలయ సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంది

Tags

Read MoreRead Less
Next Story