తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
తిరుపతిలో ఒక్కసారిగా మారిన వాతావరణం; ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాలో చెదుమదరుగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో ఒక్కసారిగా వెదర్‌ మారిపోయింది. ఉదయం నుంచి తిరుపతిలోఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అటు విజయనగరంలోనూ ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఇక బొండపల్లి మండలం తమటాడలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇక శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామునుంచి ఈదురుగాలుతో వర్షాలు పడుతున్నాయి. ఈ జిల్లాలోనూ పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అటు నెల్లూరులోనూ వెదర్‌ కూల్‌గా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి.

చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల ఎండలు, వేడిగాలులు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆ తర్వాత వర్షాలు ఊపందుకుంటాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story