Amaravati: భోగిమంటల్లో 3 రాజధానుల ప్రతులు.. అమరావతి వాసుల నిరసన

Amaravati: భోగిమంటల్లో 3 రాజధానుల ప్రతులు.. అమరావతి వాసుల నిరసన
Amaravati: బలవంతంగా పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ OTS జీవో ప్రతుల్ని బోగిమంటల్లో పడేశారు.

Amaravati: మంచిని, మార్పును ఆహ్వానిస్తూ.. చెడును వదిలేస్తూ జరుపుకునేదే భోగి పండుగ. అందుకే ఈ పండుగ సాక్షిగానే తమ ఆకాంక్షను బలంగా చాటే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. చెడు మంటల్లో కాలిపోవాలని, కష్టాల పీడ ఇక్కడితో విరగడైపోవాలని కోరుకుంటున్నారు.

అమరావతి వాసులంతా 3 రాజధానులు వద్దే వద్దంటూ ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఆ ప్రతుల్ని భోగి మంటల్లో వేశారు. తుళ్లూరు, మందడం వద్ద వేసిన భోగి మంటల్లో రాజధాని గ్రామాల ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికైనా కష్టాలు తీరి.. ఈ పండగ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అటు, తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో OTSకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు భోగి పండుగ వేదికైంది. ప్రత్తిపాడులో తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌ వరుపుల రాజా ఆధ్వర్యంలో OTS పథకంపై నిరసన తెలిపారు. బలవంతంగా పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ OTS జీవో ప్రతుల్ని బోగిమంటల్లో పడేశారు.

ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ విషయంలో బలవంతం లేదంటూనే ఎందుకు బెదిరింపులకు దిగుతున్నారని రాజా ప్రశ్నించారు. అటు, తిరుపతిలోనూ ఇలాంటి నిరసనలే కనిపించాయి. ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా తీసుకొచ్చిన వివిధ జీవోలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA సుగుణమ్మ పాల్గొన్నారు.

ఈ మూడుచోట్లే కాదు.. ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈసారి ఇలాంటి నిరనలు కనిపించాయి. పీఆర్సీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ శ్రీకాకుళంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. అలాగే గుంటూరులో జాబ్ క్యాలెండర్‌ పేరుతో మోసం చేశారంటూ యువత ఆందోళనలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story