ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొనసాగుతోన్న కరోనా కేసుల విజృంభణ

ఏపీలో కొనసాగుతోన్న కరోనా కేసుల విజృంభణ
X

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోల్చుకుంటే కరోనా కేసులు కాస్త తగ్గినా.. ఇంకా వైరస్‌ తీవ్రత మాత్రం భయాందోళనగానే ఉంది. రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీలో 24గంటల్లో.. 4వేల 622కేసులు నమోదు అయ్యాయి. వైరస్‌ బారినపడి 35మంది చనిపోయారు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య 6వేల 291కి చేరాయి. కొత్త కేసులను కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 63వేలు దాటాయి. ప్రస్తుతం ఏపీలో 42వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో కరోనాతో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఏడుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, ప్రకాశం , కడప జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు.

Next Story

RELATED STORIES