ఏపీ సర్కారుపై ఉద్యోగుల పోరు

ఏపీ సర్కారుపై ఉద్యోగుల పోరు
ఏపీ వ్యాప్తంగా నాలుగు లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యమయ్యాయి

ఏపీ సర్కారుపై సీపీఎస్‌ ఫైట్‌ మొదలైంది.ఏపీ వ్యాప్తంగా నాలుగు లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యమయ్యాయి.ఉద్యోగ జేఏసీలపై ఆధారపడటం కంటే స్వంతంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.ఇప్పటి వరకు విడివిడి గా ఉన్న APCPSE లో APCPSUS విలీనంచేశారు. మరోవైపు ఏపీజేఏసీలో అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య బయటకు రాగానే ఉపాధ్యాయ సంఘాల జేఏసీని ఏర్పాటుచేసే అవకాశం ఉందని సమాచారం. సంఘాల విలీనం నేపథ్యంలో, తాత్కాలిక ఉద్యమ ప్రకటించింది. జూన్‌ 19,26 తేదీల్లో జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించే స్పందన కార్యక్రమాల్లో ఓపీఎస్‌ అమలు, సీపీఎస్‌, జీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story