Darmavaram: ఆర్మీ ఉద్యోగిపై దాడి..నిందితులపై బెయిలబుల్‌ కేసు

Darmavaram: ఆర్మీ ఉద్యోగిపై దాడి..నిందితులపై బెయిలబుల్‌ కేసు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం జడ్పీ వైస్ ఛైర్మన్ కామిడిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి సహా మరో 9 మందిపై బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం పోలీసులు తెలిపారు. అబి శ్రీకాంత్‌రెడ్డి, ప్రభు, బద్రి, నడ్డి సుధాకర్‌తో పాటు మరో నలుగురిని గుర్తించామన్నారు. తుమ్మల గ్రామంలో మంగళవారం జరిగిన జాతరకు పరిటాల శ్రీరామ్‌ను ఆర్మీ ఉద్యోగి సమరసింహారెడ్డి ఆహ్వానించారు. దాంతో కక్ష పెంచుకున్న వైసీపీ నాయకులు.. మరో పది మందితో కలిసి మారణాయుధాలతో దాడి చేసారు. ఆ తర్వాత ఆర్మీ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేశ సైనికుడిపై దాడి చేస్తే బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వకపోతే సెలవుపై వెళ్లమని పోలీసులపై స్థానిక వైసీపీ నేత ఒత్తిడి చేసారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story