TTD: నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ..: తితిదే ఛైర్మన్

TTD: నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ..: తితిదే ఛైర్మన్
TTD: తిరుమల శ్రీవారిని ఎన్ని సార్లు దర్శించుకున్నా తనివి తీరదు. కొందరు భక్తులు ప్రతి ఏటా శ్రీవారి దర్శనం చేసుకుంటారు..

TTD: తిరుమల శ్రీవారిని ఎన్ని సార్లు దర్శించుకున్నా తనివి తీరదు. కొందరు భక్తులు ప్రతి ఏటా శ్రీవారి దర్శనం చేసుకుంటారు.. కాలి నడకన వెళ్లే భక్తులు కూడా చాలా మందే ఉంటారు. అయితే ఏప్రిల్ 1 నుంచి నడిచే వచ్చే భక్తులకు తితిదే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అలిపిరి నడక దారిలో వచ్చే భక్తుల కోసం రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి మెట్లదారిలో వచ్చే భక్తుల కోసం రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో బ్రేక్ దర్శనం కోసం రికమండ్ చేసుకునే లెటర్ల సంఖ్యను తగ్గిస్తామని తెలిపారు. వెసవిలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. కరోనాకు ముందు నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను తితిదే జారీ చేసింది. మధ్యలో కొంత కాలం నిలిపివేసిన టిటిడీ.. మళ్ల ఇప్పుడు దివ్య దర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఛైర్మన్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story