టమాటా ధర పెరగడంతో రైతులకు నిద్ర లేని రాత్రులు

టమాటా ధర పెరగడంతో రైతులకు నిద్ర లేని రాత్రులు
టమాట ధర పెరిగినా, తగ్గినా రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు.

టమాట ధర పెరిగినా, తగ్గినా రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు.దేశవ్యాప్తంగా టమాటా ధరలు మునుపెన్నడూ లేని స్థాయిలో పెరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ధరల పెరుగుదల మాత్రం సామాన్యులకు చేదుగా మారింది. టమాటా పండించిన రైతులు నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి సరైన సమయంగా భావిస్తుంటే,, మరో పక్క ఆందోళనగా ఉంటున్నారు రైతులు. కొందరు దుండగులు పంటను ఎత్తుకెళుతున్నారు. మరి కొందరు రైతును చంపేందుకు కూడా వెనుకాడ్డం లేదు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతుండగా, ఊహించని విధంగా పంటలు పండడంతో సంతోషంగా ఉండాల్సిన రైతులు, వ్యాపారులు పంటలను కాపాడుకునేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. “ధరలు బాగా పడిపోవడంతో తమ టమోటాలను రోడ్లపై విసిరే రోజులు పోయి మంచి ధర వచ్చిందని సంబర పడుతున్నారు.

అయితే తమ కడుపు కొట్టేందుకు దొంగలు, సంఘ వ్యతిరేకులు రంగ ప్రవేశం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లికి చెందిన ఉదయ్ అనే రైతు తన పొలంలో ఉన్న టమోటాలు చోరీకి గురవడంతో రూ.50,000 విలువైన నష్టాన్ని చవిచూశాడు. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతు తల పట్టుకుంటున్నాడు. భద్రతా చర్యలు పటిష్టం చేయకపోతే, పెరుగుతున్న సంఘటనలు, టమోటా దొంగతనాలను నియంత్రించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story