ఆంధ్రప్రదేశ్

Annavaram : అన్నవరం ఉత్సవాల్లో అపచారం.. భక్తి పాటలకు బదులు సినిమా డాన్సులు

Annavaram : శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక వాతావరణానికి బదులు, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా సినిమా డాన్సులు హోరెత్తిపోయాయి.

Annavaram  : అన్నవరం ఉత్సవాల్లో అపచారం.. భక్తి పాటలకు బదులు సినిమా డాన్సులు
X

Annavaram : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో అపచారం జరిగింది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక వాతావరణానికి బదులు, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా సినిమా డాన్సులు హోరెత్తిపోయాయి. స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవం ఊరేగింపులో భక్తి పాటలకు బదులు సినిమా డాన్సులు వేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కార్యక్రమంలోనే కొందరు అధికారులు, సిబ్బంది మద్యం మత్తులో తూగుతూ స్టెప్పులేయడం కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

సత్యదేవుని ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున రావణబ్రహ్మ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవంలో ఆధ్యాత్మికత కనిపించలేదు. హుషారైన సినిమా పాటలతో, హోరెత్తిన అశ్లీల నృత్యాలతో ఈ ర్యాలీ సాగింది. చూస్తున్న భక్తులు అసలిది దేవుడి కార్యక్రమమా.. ఏదైనా రికార్డింగ్‌ డాన్స్‌ కార్యక్రమమా అని ప్రశ్నించారంటే ఆలయ ప్రతిష్ట మంటగలిపేలా ఈ కార్యక్రమం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

అన్నవరం దేవస్థానం అధికారుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్యాణోత్సవాలకు రూ.70 లక్షలు కేటాయించింది ఇందుకా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గ్రామోత్సవంలో బాధ్యత మరిచి సినిమా పాటలకు డాన్సులేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ మంత్రి ఈ అరాచకంపై స్పందిచి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిన్న జరిగిన ఉత్సవాల్లో ఆలయ ఈవోతోపాటు స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఇలాంటివి జరగడమంటే సంప్రదాయాల్ని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో చెప్పడానికి ఉదాహరణ అంటున్నారు. ఇలాంటి ఘటనపై తూతూ మంత్రంగా విచారణ జరిపి, మమ అనిపించడం కాకుండా బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.

Next Story

RELATED STORIES