konaseema: ఉలిక్కిపడ్డ కోనసీమ.. బోరు బావి లోంచి గ్యాస్ బ్లో అవుట్..

konaseema: ఉలిక్కిపడ్డ కోనసీమ.. బోరు బావి లోంచి గ్యాస్ బ్లో అవుట్..
మంటలు 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో బోరు బావి నుంచి మంటలు ఆగడం లేదు. శివకోటిలో గ్రామంలోని ఆక్వా చెరువు నుంచి గ్యాస్‌ ఉధృతంగా బయటకు వస్తోంది. మంటలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. ఉదయం నుంచి మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఓఎన్జీసీ, ఫైర్‌ సిబ్బంది. అయితే ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు.ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్‌ కోసం గతంలో సెస్మిక్‌ సర్వే జరిగినట్లు తెలుస్తోంది. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట బోరు వేయగా రెండ్రోజుల క్రితం ఈ బోరును మరింత లోతుకు తవ్వారు. దీంతో భూమిలోని గ్యాస్‌ బయటికి వచ్చి మంటలు వస్తున్నాయంటున్నారు అధికారులు. పైప్‌లైన్‌ అయితే గ్యాస్‌ను కంట్రోల్‌ చేసిన మంటలను ఆపేవాళ్లమన్నారు. కానీ, భూమిలో నుంచి నిరంతరంగా గ్యాస్‌ వస్తుండటంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారిందంటున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story