బ్యాంకుల ముందు చెత్తవేయడం చెత్తపని - జీవీఎల్

బ్యాంకుల ముందు చెత్తవేయడం చెత్తపని - జీవీఎల్
కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకుల ముందు చెత్త వేయడాన్ని బీజేపీ ఎంపి జీవీఎల్ హేయమైన చర్యగా అభివర్ణించారు.

కృష్ణాజిల్లాలో బ్యాంకుల ముందు చెత్తవేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు బీజేపీ ఎంపి జీవీఎల్ నరసింహారావు. ఈ చర్యలకు ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రమేయం ఉంటే వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకుల ముందు చెత్త వేయడాన్ని ఆయన హేయమైన చర్యగా అభివర్ణించారు.

అటు బ్యాంకుల ముందుచెత్తవేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ADMAలు శేఖర్, వెంకట్రామయ్యను విచారణ అధికారులుగా నియమించారు. వీరు మెస్మా సిబ్బంది, పారిశుధ్య కార్మికులను విచారించారు. చెత్త ఎవరు వేశారో తనకు తెలియదని మున్సిపల్ కమిషనర్ అన్నట్లు సమాచారం. ఎవరు వేశారు అనేది సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. అయితే పోలీసుల వద్ద ఉన్న వీడియోలను బయట పెట్టవద్దని కొందరు అధికారులు బతిమిలాడుతున్నట్లు సమాచారం. విచారణ అధికారులను సైతం కార్యాలయ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కార్మికులు ఇద్దరి మధ్య నలిగి పోతున్నారు. అధికారి ఆగ్రహానికి గురవుతామని కార్మికులు విచారణ అధికారికి నిజం చెప్పలేక పోతున్నట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story