మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతంలో కుంభవృష్ఠి..!

మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతంలో కుంభవృష్ఠి..!
Rain Alerts: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు.

ఉత్తర కోస్తాంధ్రలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీని ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక.. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story